రెండు తెలుగు రాష్ట్రాల్లో పడిన భారీ వర్షలతో.. ఆంధ్రా, తెలంగాణలో కీలకమైన కృష్ణ, గోదావరి నదులకు భారీ వరద వస్తుంది. అయితే ప్రస్తుతం కృష్ణమ కొంచెం నెమ్మదించినా గోదావరి నీటిమట్టం మాత్రం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటిమట్టం క్రమేపీ పెరుగుతుంది.
ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులకు చేరింది. అలాగే బ్యారేజ్ నుండి 11లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల. చేస్తున్నారు. బ్యారేజి కి సంబంధించిన మొత్తం 175 గేట్లు ఎత్తివేశారు. అయితే ప్రస్తుతం గోదావరి నది పై ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. దీనితో ధవళేశ్వరం బ్యారేజీకి మరింత వరదం వచ్చి.. వరద మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గంటకు ఒక పాయింట్ వంతున ధవళేశ్వరం నీటిమట్టం పెరుగుతుంది.