తెలంగాణ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డీఎస్సీ-2024 ఫలితాలను విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జులై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం….ఇవాళ ఫలితాలు రిలీజ్ చేసింది. 2,46,584 (88.11%) మంది అభ్యర్థులు…డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యారు. 56 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసింది సర్కారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… విద్యాశాఖ అధికారులు అతి తక్కువ సమయంలో ఫలితాల కోసం విశేష కృషి చేసారని.. 2,46,584 మంది డిఎస్సి 2024 పరీక్షలకు హాజరు అయ్యారన్నారు. 1:3 ప్రాతిపదికన ఫలితాలు విడుదల చేసామని… ఫైనల్ నియామకాలు దసరా పండుగ లోపు చేస్తామని వెల్లడించారు. 9.10.2024 లోపు సర్టిఫికెట్ వేరిఫికేషన్ చేసి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణలో దసరా పండుగ ప్రతీ ఒక్కరు ఘనంగా నిర్వహించుకుంటారని వెల్లడించారు. గత ప్రభుత్వం 7 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు….డిఎస్సి నిర్వహణ చేయక పోవడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు.