ఇవాళ తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు

-

ఇవాళ తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త. ఇవాళ తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో DSC 2024 ఫలితాల విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సచివాలయంలో ఫలితాలను విడుదల చేస్తారు.

Telangana DSC Results 2024

గత ఏడాది డిసెంబర్​లో అధికారం చేపట్టిన కాంగ్రెస్​ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీన 11062 టీచర్​ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ సారి DSC పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన తర్వాత 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

Read more RELATED
Recommended to you

Latest news