ప్రస్తుతం తెలంగాణలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను రెండోసారి పొడిగించింది. ఇక కరోనా తీవ్రత నేపథ్యంలో ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. సెట్ ఎగ్జామ్స్‌ను కూడా వాయిదా వేస్తూ వస్తోంది. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది.
తాజాగా తెలంగాణ ఎంసెట్ 2021 దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది ప్రభుత్వం. ఎలాంటి అడిషనల్ ఫీజు లేకుండా జూన్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ విషయాన్ని ఎంసెట్ కన్వీనర్ గురువారం మీడియాకు వెల్లడించారు.
వాస్తవానికి ఎంసెట్ గడువు మే 18నే ముగియాల్సి ఉంది. కానీ కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో.. దాన్ని మే 26వరకు పొడిగించింది. ఇప్పుడు లాక్ డైన్ ఉన్న నేపథ్యంలో చాలామంది అప్లై చేసుకోలేకపోయారు. వారందరినీ దృష్టిలో పెట్టుకుని మరోసారి గడువును జూన్ 10 వరకూ పొడిగించింది ప్రభుత్వం. ఈ ఎంసెట్ ఎగ్జామ్స్‌ను జేఎన్టీయూ నిర్వహిస్తోంది.