నేడు ఎంసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఇవాళే ఎంసెట్ చివరి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో తప్పనిసరిగా రిపోర్ట్‌ చేయాలని అధికారులు తెలిపారు. లేకుంటే వారి సీటు రద్దవుతుందని చెప్పారు. ఈ నెల 17 నుంచి 23 వరకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ జరగనుందని వెల్లడించారు.

మరోవైపు.. ఈసెట్‌ తొలి విడత సీట్లను అధికారులు మంగళవారం రోజున కేటాయించారు. పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన విద్యార్థులు ఈసెట్‌ ర్యాంకు ద్వారా నేరుగా బీటెక్‌, బీఫార్మసీ రెండో సంవత్సరంలో (లేటరల్‌ ఎంట్రీ) ప్రవేశాలు పొందుతారు. ఇంజినీరింగ్‌ విభాగాల్లో 11,698 సీట్లు అందుబాటులో ఉండగా.. 9,606 సీట్లు (82.11%) భర్తీ అయ్యాయి. కంప్యూటర్‌ సైన్స్‌, సంబంధిత బ్రాంచీల్లో 6,900 సీట్లకు 5,118 (74.17%) నిండాయి. సీట్లు పొందిన వారు ఈ నెల 12వ తేదీలోపు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news