తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in/ లో చూసుకోవచ్చని విద్యామండలి ప్రకటించింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ర్యాంకులు చెక్ చేసుకోవచ్చని తెలిపింది. ఫలితాల తర్వాత విడతల వారీగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థికి వచ్చిన ర్యాంకు, కోర్సు, కళాశాల, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అడ్మిషన్ కేటాయిస్తారు. సీటు కేటాయించిన తర్వాత.. సదరు అభ్యర్థి సంబంధిత కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయాలి.
ఫిబ్రవరి నెల 28న ఎంసెట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించింది. దీనికి చివరి తేదీ ఏప్రిల్ 10 వరకు గడువు ఇచ్చింది. మార్చి 30 తేదీన పరీక్ష రాసే అభ్యర్థులకు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించింది. మే 10 నుంచి 14 వరకు ఈ పరీక్ష నిర్వహించారు.