రైతు బంధు సాయం అందలేదంటూ..కాంగ్రెస్ సర్కారుపై రైతులు ఫైర్

-

తెలంగాణలో కొలువుదీరిన నూతన సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి తగ్గట్టు కాకపోయినా.. ఇటీవలే రైతు బంధు నగదు విడుదల చేసింది. అయితే ఈ నగదు ఇంకా చాలా మంది రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ఇప్పటికే యాసంగి సాగు మొదలుపెట్టిన రైతులకు పెట్టుబడి సాయం అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట సాయం కోసం ఎంతో మంది రైతులు పడిగాపులు కాస్తున్నారు.

రైతుబంధు సాయం అందకపోవడంతో వచ్చే పంట ఎలా సాగు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రైతుబంధు పైసలు ఎప్పుడు పడతాయా అని కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. నవంబర్ నెల ఆరంభంలోనే పడే రైతుబంధు డిసెంబర్ గడుస్తున్నా ఎందుకు వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్లో సాగు చేసిన పంట ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోలు జరగలేదని రోడ్లపై ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నామని అన్నదాతలు వాపోతున్నారు. కొత్తగా కొలుదీరిన ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా త్వరగా రైతుబంధు పైకాన్ని తమ ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version