తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు..చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ రుతుపవనాల ప్రభావంతో నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కేరళలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే… తెలంగాణ రైతాంగానికి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది.
ఈ వర్షాకాలంలో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. వారంలోపు తెలంగాణలో రుతుపవనాలు..ప్రవేశించనున్నట్లు పేర్కొంది. ఎల్ నినో ప్రభావంతో గతేడాది జూన్ చివరి వారంలో రుతుపవనాల రానున్నట్లు వివరించింది. గతేడాది వర్షాకాలం మొత్తం పడాల్సిన వర్షపాతం కేవలం పదిహేను రోజుల్లోనే నమోదు కానందని వెల్లడించింది. ఎల్ నినో ప్రభావం పోవడంతో ఈ సారి త్వరగా రుతుపవనాలు వస్తాయట. చురుకుగా నైరుతి రుతుపవనాల కదలిక ఉండటతో..తెలంగాణ రాష్ట్రంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు ఉంటాయని పేర్కొంది వాతావరణ శాఖ.