ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి మరో పిటిషన్..!

-

ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ చేపట్టిన అధికారులను మార్చాలంటూ హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఐజీ సహా కొందరూ పోలీస్ అధికారులు తమను టార్గెట్ చేసి ఏకపక్షంగా వ్యవహరించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. మాచర్లలో అల్లర్ల తరువాత వైసీపీ క్యాడర్ పైనే కేసులు పెట్టారు తప్ప మా ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని పిన్నెల్లి పిటిషన్ లో ప్రస్తావించారు.

ఈనెల 13, 1 తేదీలలో అల్లర్లు జరిగితే 23వ తేదీన బెయిల్ వచ్చాక దొంగ రికార్డులతో కోర్టులో పోలీసులు దొరికారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ లో తెలిపారు. సదరు అధికారులపై చర్యలు తీసుకొని విచారణ అధికారులుగా వేరే వారిని నియమించాలని కోరారు. విచారణకు అనుమతించిన ఏపీ రాష్ట్ర హైకోర్టు.. మధ్యాహ్నం 2.30 గంటల తరువాత విచారణ చేయనున్నట్టు పేర్కొంది. మాచర్లలో జరిగిన అల్లర్లపై ఇప్పటికే ఏపీ హైకోర్టు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  మూడు కేసుల్లో బెయిల్ ను మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news