తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ వర్గీకరణ జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించిన తెలంగాణ ప్రభుత్వం… ఏ గ్రూపుకు 1%, బీ గ్రూపుకు 9%, సీ గ్రూపుకు 5 % చొప్పున రిజర్వేషన్లు ఇవ్వనుంది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

ఇది ఇలా ఉండగా నేడు భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవం ఉండనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.. మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు కానుంది భూభారతి పోర్టల్. పైలట్ ప్రాజెక్టులో సలహాలు, సూచనలు స్వీకరణ చేయనున్నారు. ప్రజల సూచనల ఆధారంగా పోర్టల్ అప్డేట్ చేశారు.