ప్రతి ఒక్కరి జీవితంలో రిలేషన్షిప్ కు సంబంధించి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాకుండా చిన్న చిన్న విషయాలకు ఎన్నో గొడవలు కూడా అవుతాయి. వాటిని తగ్గించుకొని తగిన మార్పులను చేసుకోవడం వలన పార్ట్నర్ తో ఎంతో ఆనందంగా ఉండవచ్చు. కనుక రిలేషన్షిప్ లో ఎలాంటి సమస్యలైనా వీలైనంతవరకు త్వరగా వాటిని తగ్గించుకొని ముందుకు వెళ్లాలి. ఎప్పుడైనా భాగస్వామితో గొడవలు ప్రారంభమైన లేక వారి ప్రవర్తన వలన ఇబ్బంది కలిగినా మూడో వ్యక్తి మీ జీవితంలోకి వచ్చారు అని గమనించాలి.
అంతేకాకుండా ఎలాంటి విషయాలను మీ భాగస్వామితో చర్చించినా వాటి వెనుక నిజమైన కారణాలు తెలుసుకుని వ్యవహరించాలి. జీవిత భాగస్వామి మీ పై ప్రేమ, అభిమానం ఎలా చూపిస్తున్నారో తెలుసుకోవాలి. ఎలాంటి మార్పులు వచ్చినా సరే దానికి సంబంధించిన కారణాలను తెలుసుకొని పరిష్కరించుకోవాలి. ఒకవేళ వారి ఫోన్ ను దూరంగా ఉంచడం లేక పాస్వర్డ్ చెప్పకపోవడం చేస్తే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఇటువంటి పరిస్థితిలు ఏర్పడినప్పుడు వెంటనే తగిన చర్యలను తీసుకోవాలి. అంతేకాకుండా మీ పార్టనర్ తో సమయాన్ని గడిపే విధంగా చూసుకోవాలి.
ఎలా అయితే గతంలో మీ గురించి ఆలోచించి, ప్రస్తుతం మీకు సమయాన్ని కేటాయించకపోవడం వంటివి చేస్తుంటే కచ్చితంగా మీ మధ్య దూరం ఏర్పడింది అని గమనించాలి. వీలైనంతవరకు కలిసి సమయాన్ని గడపడం వంటివి కచ్చితంగా చేయాలి. అంతేకాకుండా రిలేషన్షిప్ లో ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెబుతుంటే ఎంతో జాగ్రత్త పడాల్సిందే. కొంతమంది అబద్ధాలను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే తడబడుతూ ఉంటారు. ఇలా చేస్తున్నప్పుడు కచ్చితంగా పూర్తి విషయాలను చెప్పట్లేదు అని తెలుసుకోవాలి. కొంత శాతం మంది ప్రేమ చూపిస్తూ వారి తప్పులను కనబడకుండా చేస్తారు. ఇలాంటి సందర్భాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కనుక ఇటువంటి సంకేతాలు కనిపిస్తుంటే కచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాలి.