మహిళలకు కేసీఆర్ సర్కార్ మరో కానుక ఇవ్వనుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వ కానుక ఇచ్చేందుకు సిద్ధం అయింది. ఈ మేరకు 750 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల నిధుల విడుదల చేసింది సర్కార్.
పురపాలికల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల కోసం 250 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. మరో 500 కోట్ల రూపాయల నిధులను గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు విడుదల చేశామని వివరించారు. అలాగే, ఆరోగ్య మహిళా కార్యక్రమం, రేపు హాలీడే కూడా ప్రకటించింది సర్కార్.