ఇందిరమ్మ ఇండ్ల కోసం తెలంగాణ సర్కార్ కొత్త రూల్స్ పెట్టినట్లు సమాచారం అందుతోంది. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులలో 53.3% మంది అనర్హులని ప్రభుత్వం తేల్చినట్లు సమాచారం అందుతోంది. ఇందిరమ్మ ఇండ్ల కోసం కాంగ్రెస్ పెట్టిన రూల్స్ అంటూ గులాబీ పార్టీ నేతలు ప్రచారం జరుగుతోంది. ఇందిరమ్మ ఇల్లు 60 గజాల లోపే కట్టుకోవాలని పేర్కొన్నారట.

బ్యాంకులో రూ.50 వేల కంటే ఎక్కువ క్రాప్ లోన్ ఉంటే అనర్హులు అని సమాచారం అందుతోంది. కుటుంబం మొత్తానికి రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే అనర్హులు అని చెబుతున్నారు. కుటుంబంలో ట్రాక్టర్ ఉంటే ఇందిరమ్మ ఇల్లు పథకానికి అనర్హులు అని తెలుస్తోంది. ఇందిరమ్మ ఇల్లు కోసం 77.18 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 41.15(53.3%) లక్షల మంది అనర్హులుగా తేల్చి చెప్పిందట ప్రభుత్వం.