రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ వరంగల్‌లో పర్యటించనున్నారు. భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన వరంగల్ నగరంలో గవర్నర్ పర్యటిస్తారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో నేరుగా వరంగల్ నిట్‌కు చేరుకుని.. గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరద ప్రభావిత కాలనీలను సందర్శిస్తారు. జవహర్ నగర్, నయీం నగర్, భద్రకాళీ బండ్, ఎన్టీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్ మొదలైన ముంపు ప్రాంతాలకు వెళ్లి.. బాధితులకు రెడ్ క్రాస్ సౌసైటీ ద్వారా హెల్త్ కిట్స్‌ను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం వరంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.
మరోవైపు.. వరద నష్టం అంచనాకోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్రం బృందం.. ఇవాళ భూపాలపల్లి, ములుగు జిల్లాలో పర్యటించనుంది. వరదల ముంపు బారిన పడి కోలుకోలేని నష్టం చవి చూసిన మోరంచపల్లి, కొండాయి గ్రామాలను బృందం సభ్యులు సందర్శించనుంది. ఇవాళ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి, ములుగు జిల్లా కొండాయ్ గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించి….నష్టం అంచనా వేస్తుంది. రేపు ఉదయం భద్రాచంలో కేంద్ర బృందం పర్యటిస్తుంది.