జిల్లాలకు ఇంఛార్జీ మంత్రులను నియమించిన ప్రభుత్వం

-

కలెక్టర్లు, ఎస్పీలతో ఆదివారం రోజున సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో ప్రజా పాలనకు శ్రీకారం చుట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ నెల 28 జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించి ఆరు గ్యారంటీలకు దరఖాస్తుతో వినతులు, ఫిర్యాదులు స్వీకరించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

ఉమ్మడి జిల్లాకు ఒక మంత్రి ఇంచార్జిగా, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి ప్రజాపాలన కార్యక్రమం అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారులు ప్రజల నుంచి గౌరవ, మర్యాదలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలని సూచించిన ముఖ్యమంత్రి.. ఎంతటివారినైనా ఇంటికి పంపించే శక్తిమంతమైన చైతన్యం తెలంగాణ ప్రజలకు ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని పని చేయాలని హెచ్చరించారు.

ఏయే జిల్లాకు ఎవరెవరిని కేటాయించారంటే?

హైదరాబాద్ జిల్లా – పొన్నం ప్రభాకర్

రంగారెడ్డి జిల్లా – దుద్దిళ్ల శ్రీధర్ బాబు

వరంగల్ జిల్లా – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కరీంనగర్ జిల్లా – ఉత్తమ్ కుమార్ రెడ్డి

మహబూబ్నగర్ జిల్లా – రాజనర్సింహా

నిజామాబాద్ జిల్లా – జూపల్లి కృష్ణారావు

ఖమ్మం జిల్లా – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ జిల్లా – తుమ్మల నాగేశ్వరరావు

ఆదిలాబాద్ జిల్లా – సీతక్క

మెదక్‌ జిల్లా – కొండా సురేఖ

Read more RELATED
Recommended to you

Latest news