డబ్బు లేకపోయినా కష్టపడి పనిచేస్తేనే మజా ఉంటుంది – బండి సంజయ్‌

-

డబ్బులుండి రాజకీయాల్లోకి వచ్చి అధికారం సంపాదిస్తే అంత మజా రాదని… కష్టపడి పైకొస్తేనే మజా ఉంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తనతోపాటు ఇక్కడున్న లీడర్లు, అనేక మంది ఎన్నారైలు డబ్బు లేకపోయినా కష్టపడి పైకొచ్చిన వారేనన్నారు. ఎక్కడో విదేశాల్లో ఉంటూ భారత్ అభ్యున్నతికి క్రుషి చేస్తున్న ఎన్నారైల సేవలు మరువలేనివన్నారు.

హైదరాబాద్ లోని హోటల్ మారియట్ లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పేరుతో యోయో టీవీ అధినేత మల్లారెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, రాకేశ్ రెడ్డి, పాయల శంకర్, బీజేపీ ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… ప్రవాస తెలంగాణ వాసులతో కలిపి ఏర్పాటు చేసిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫోరం ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇక్కడున్న వాళ్లంతా కష్టపడి పైకొచ్చిన వారే. నిజం చెప్పాలంటే డబ్బులుండి వ్యాపారాలు చేసి, రాజకీయాల్లోకి వస్తే మజా రాదు. కిందిస్థాయి నుండి కష్టపడి పైకి వచ్చే వాళ్లకు ప్రజల సమస్యలు తెలుసు. కష్టాలు తెలుసు. ఆ కష్టాల్లోనే మజా ఉంటుంది. ఉన్నతస్థాయికి వచ్చాక ప్రజల సమస్యలను పరిష్కరించాలనే తపన ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news