తెలంగాణలో హుక్కా కేంద్రాలపై నిషేధం

-

మత్తు పదార్థాల వినియోగం, సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.మత్తు ఊసే లేకుండా రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా నిలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హుక్కా కేంద్రాలపై రాష్ట్ర సర్కార్ నిషేధం విధించింది. ఈ నెల 4వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఆర్ధిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.. తాజా నిర్ణయంతో హుక్కా కేంద్రాల మాటున నగరంలో జరుగుతున్న ఆగడాలకు అడ్డుకట్టపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తాజాగా హుక్కా పార్లర్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలకు వెళ్లినప్పుడు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలతో పాటు పొగాకు ఉత్పత్తులు వినియోగదారులకు అందిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడే యువకుల్లో ఎక్కువ మంది హుక్కా కేంద్రాలకు వెళ్లేవారు ఉన్నట్లు తేలడంతో హుక్కా కేంద్రాలపై నిషేధం విధించాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలో ఉత్తర్వులు వస్తాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news