మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు దోచుకున్నారు: మంత్రి వెంకట్‌రెడ్డి

-

బీఆర్ఎస్‌ ప్రభుత్వం కమీషన్ల కోసం అవసరం లేని ప్రాజెక్టులను కట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై కేసీఆర్ దొంగ దీక్షలు చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, హరీశ్‌ రావుకు లేదని అన్నారు జగన్‌ను ఇంటికి పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. జగన్‌తో లాలూచీ పడి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. నల్గొండ ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పి.. ఇక్కడికి రావాలని మంత్రి డిమాండ్ చేశారు. మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు దోచుకున్నారని గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

అన్ని రంగాల వారికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ విద్యా వ్యవస్థను నాశనం చేసిందిని మండిపడ్డారు. రాష్ట్రంలో 6 వేలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయని పేర్కొన్నారు. విద్య, వైద్యం కోసం బడ్జెట్‌లో మొదటి ప్రాధాన్యత ఇచ్చామన్న మంత్రి వెంకట్‌రెడ్డి త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news