పంచాయతీ కార్యదర్శులుగా జేపీఎస్‌లు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

-

రాష్ట్రంలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శు(జేపీఎస్‌)లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. జేపీఎస్​లను నాలుగో గ్రేడ్‌ పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాప్ లేకుండా.. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని, జిల్లాస్థాయి మదింపు కమిటీ ద్వారా 70%, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. దీనికి అనుగుణంగా కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలో అర్హులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది.

70 శాతం మార్కులు రాని వారికి మరో ఆరు నెలలు అవకాశమిచ్చి, మళ్లీ ఆరు నెలల వరకు వారి పనితీరును పరిశీలించాక నియామకాలపై నిర్ణయం తీసుకోవాని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 9,355 మంది జేపీఎస్‌లుండగా… వారిలో 5,435 మందే నాలుగేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారికి మరో ఆరు నెలల తర్వాత నాలుగేళ్ల సర్వీసు పూర్తవుతుంది. జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం వారి పనితీరుపై అధ్యయనానికి జిల్లాల్లో అదనపు కలెక్టర్ల నేతృత్వంలో మదింపు కమిటీలను ఏర్పాటు చేసింది. జులై నుంచి వారు గ్రామాల్లో పర్యటించి కార్యదర్శుల పనితీరును పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news