మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్

-

మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం కిక్కిచ్చే న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 70 కొత్త బార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అబ్కారీ శాఖ రెడీ అవుతోంది. ఇప్పటికే తెలంగాణలో వేయికి పైగా బార్లుండగా.. వీటిలో సగానికిపైగా జంట నగరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, నగరాల్లో కొత్తగా బార్లు ఏర్పాటు చేయాలని సర్కార్ సంకల్పించింది.

రాష్ట్రంలోకి కొత్త లిక్కర్ బ్రాండ్లు

బార్లతో పాటు రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే బీర్లు, లిక్కర్ కంపెనీల నుంచి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానించించింది. ఇప్పటి వరకు 40 కంపెనీలు అప్లై చేసుకోగా.. అందులో 20 దాకా విదేశీ లిక్కర్, 10 విదేశీ బీర్ బ్రాండ్లు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 53 దేశీయ, విదేశీ బ్రాండ్లు బీర్లు, లిక్కర్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వీటిసంఖ్యను పెంచేందుకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version