కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తూ ఉంటారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ పథకం కేవలం వ్యవసాయం చేస్తున్న సమయంలో మాత్రమే కాకుండా రైతులు ఎవరైతే వృద్యాప్యం లో ఉంటారో వారికి కూడా ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకానికి అర్హులైన రైతులకు 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పింఛన్ లను కూడా పొందే విధంగా రూపొందించారు. ఈ విధంగా రైతులకు నెలకు 3000 వరకు పింఛన్ ను అందజేస్తున్నారు.
అర్హత వివరాలు:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు భారత పౌరులు అయి ఉండాలి మరియు చిన్న లేక సన్న కారు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం ద్వారా ఉపయోగాలను పొందాలంటే నేషనల్ పెన్షన్ స్కీం, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీం వంటి ఇతర ప్రభుత్వ సామాజిక భద్రత పథకాలను ద్వారా ప్రయోజనాలను పొందకూడదు. అదేవిధంగా ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన, ప్రధానమంత్రి వ్యాపార మాన్ ధన్ యోజన పథకాలలో లబ్ధిదారులుగా ఉన్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు అనర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ముందు సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్నును పూర్తిగా చెల్లించాల్సి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పథకానికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే రైతులు ముందుగా కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లాలి. ఆ కేంద్రాలలో ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ విధంగా ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత కామన్ సర్వీస్ సెంటర్ ఆపరేటర్ అప్లికేషన్ ను ఆన్లైన్ లో అందజేస్తారు. దీనిలో భాగంగా ఆధార్ కార్డు నెంబర్, బ్యాంక్ పాస్ బుక్, వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలను అందజేయాలి. ఈ విధంగా నమోదు చేసిన తర్వాత అర్హులైన వారికి సమాచారాన్ని అందజేస్తారు. ఈ విధంగా పథకంలోకి చేరిన రైతులు వారి వయసు ప్రకారం ప్రీమియంను చెల్లించాలి. ఈ విధంగా 60 సంవత్సరాల వరకు చెల్లించాలి. దాని తర్వాత ప్రతి నెల 3 వేల రూపాయలను పొందవచ్చు. రైతు చనిపోతే వారి భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు.