గ్రూప్-1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ అలర్ట్ జారీ చేసింది. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక జరగనున్నట్లు స్పష్టత ఇచ్చింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 29, 55 నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని ప్రకటించింది. గ్రూప్-1 మెయిన్స్‌కు ఒకటి నిష్పత్తి 100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం…వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకొని…అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని కమిషన్ను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించిన సర్వీస్ కమిషన్ వాటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. 1:100 పద్థతి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనలో 1: 50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు వెల్లడిస్తూ ఇటీవల టీజీపీఎస్సీ మెమో జారీచేసింది. గ్రూప్-1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రధాన పరీక్షకు సాధారణ పరిపాలనశాఖ జారీచేసిన జీవో (నం.55, 29)లలోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది.