అక్టోబర్​లో గ్రూప్-3 పరీక్ష.. వారం రోజుల్లో ప్రకటన

-

గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్. గ్రూప్‌-3 పరీక్ష అక్టోబర్‌ నెలలో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ దిశగా కమిషన్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు మూడుసార్లు చర్చించి.. ఎన్నికలకు ముందే పరీక్ష నిర్వహించాలనే అభిప్రాయానికి కమిషన్‌ వచ్చినట్టు తెలుస్తోంది. మరో వారం, పది రోజుల్లో గ్రూప్‌-3 పరీక్ష తేదీలను కమిషన్‌ ప్రకటించనుందట. రాష్ట్రంలో 105 విభాగాల్లో గ్రూప్‌-3 క్యాటగిరీలో 1,363 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 394 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

అక్టోబర్‌ నెలలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఐబీపీఎస్‌తోపాటు మిగతా పరీక్షలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిని పరిగణనలోకి తీసుకొని గ్రూప్‌-3 పరీక్ష తేదీలను పరిశీలిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారి తెలిపారు. అక్టోబర్‌ రెండు లేదా మూడో వారంలో పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ భావిస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికల్లోపే పరీక్షలన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version