లబ్ధిదారులకు అలర్ట్.. ఎన్నికలయ్యాకే గృహజ్యోతికి కొత్త దరఖాస్తులు

-

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇళ్లకు ఉచిత విద్యుత్తు ఇచ్చే ‘గృహజ్యోతి’ పథకానికి కొత్త లబ్ధిదారుల  నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. కోడ్‌ ముగిసిన వెంటనే మళ్లీ కొత్త దరఖాస్తులను ఆమోదిస్తామని ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’ (డిస్కం)లు తెలిపాయి.

‘గృహజ్యోతి’ పథకం కింద గత నెలలో మొదటిసారి 36 లక్షల ఇళ్లకు జీరో కరెంటు బిల్లులు జారీ అయిన విషయం తెలిసిందే. మరో 7 లక్షల ఇళ్ల కనెక్షన్లు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జారీ చేయాల్సి ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వల్ల అది ముందుకు సాగలేదు. వీటితో కలిపి రాష్ట్రంలో తొలి నెల 43 లక్షల మందికి ఈ పథకం కింద అర్హత లభించింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షలకు పైగా రేషన్‌ కార్డులున్నందున మిగిలిన వారు తమపేరు కూడా నమోదు చేయాలని దరఖాస్తులిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ కారణంగా నమోదు ప్రక్రియను నిలిపివేశారు. ఇక ఎన్నికలు పూర్తి కాగానే కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news