ఐదేళ్ల బాలికపై రేప్ ఆపై హత్య కేసులో దోషికి ఉరిశిక్ష

-

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో 2017లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హతమార్చిన కిరాతకుడికి కింది కోర్టు నిందితుడికి విధించిన ఉరిశిక్షను సమర్థిస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అల్కాపురి టౌన్‌షిప్‌లో భవన నిర్మాణ కార్మికుల శిబిరం వద్ద 2017 డిసెంబరు 12న మధ్యాహ్నం ఇంటి ముందు ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా ఆమె తల్లి ఇంట్లోకి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దినేష్‌ కుమార్‌ అనే నిందితుడు చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి.. పక్కన పొదల్లోకి తీసుకెళ్లి రెండుసార్లు చిన్నారిపై నిందితుడు అత్యాచారం చేశాడు. ఘటన గురించి బాలిక బయట చెబుతుందని భావించిన నిందితుడు అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిపై సిమెంట్ రాయితో కొట్టి చంపాడు.

ఈ కేసులో తల్లి ఫిర్యాదుతో దినేష్ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా నిజం ఒప్పుకున్నాడు. ఈ కేసులో వాంగ్మూలాలు, ఆధారాలను పరిశీలించిన దిగువ కోర్టు నిందితుడికి ఉరి శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఉరి శిక్షను ఖరారు చేసేందుకు రంగారెడ్డి జిల్లా కోర్టు కేసును హైకోర్టుకు సిఫారసు చేసింది. ఇందులో ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం… నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version