బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపై హై కోర్టులో విచారణ..!

-

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపుల పై హై కోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్‌ తో పాటు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం చౌకగా భూములు అమ్మకాలు చేశారని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేసారు. 500 కోట్లు విలువైన భూమిని 5 కోట్లుకు కేటాయించారని తన వాదనల్లో వినిపించారు. గజం 100 రూపాయలకే కేటాయింపు జరిగినట్లు కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.

అయితే ఇందులో 2022 నుండి ప్రతివాది కేసీఆర్ కౌంటర్ ధాఖలు చేయలేదని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. దాంతో ప్రతి వాది మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వం కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చిన హై కోర్టు.. మూడు వారల్లో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. ఇక జర్నలిస్టులు, అధికారులకు భూ కేటాయింపుల పై గత నెల 25న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును కోట్ చేసారు పిటిషనర్. ఇక అనంతరం ఈ పిటిషన్ లో తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news