ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సిట్ మెమో కొట్టివేతను సమర్థించిన హైకోర్టు

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దాఖలు చేసిన మెమోను అనిశా కోర్టు కొట్టివేయడాన్ని హైకోర్టు సమర్థించింది. బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌, తుషార్‌ వెల్లాపల్లి, శ్రీనివాస్‌లను ఈ కేసులో నిందితులుగా చేరుస్తూ.. గతంలో సిట్‌ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గుర్నీ నిందితులుగా చేర్చడాన్ని తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు ఇటీవల సిట్‌ మెమోను కొట్టివేసింది. దీంతో సిట్‌ బృందం హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సిట్‌ అప్పీలును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

మరోవైపు ఇదే కేసులో బీఎల్‌ సంతోష్‌పై సిట్ విచారణపై హైకోర్టు స్టే పొడిగించింది. జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్‌పై సిట్ విచారణపై స్టే పొడిగిస్తూ నిర్ణయించింది.బీఎల్‌ సంతోష్ సహా నలుగురికి సీఆర్‌పీసీ 41ఏ నోటీసులపై స్టే సీఆర్‌పీసీ 41ఏ నోటీసులపై ఇచ్చిన స్టే ఈ నెల 23 వరకు పొడిగిస్తున్నట్లు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన హైకోర్టు స్టే గడువు డిసెంబరు 30తో ముగిసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version