ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ

-

ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా లో పోస్ట్‌ చేశారు మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ 2 త‌ర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని హైకోర్టు స‌మ‌ర్థిస్తూ తీర్పు ఇవ్వ‌డం శుభ ప‌రిణామం. తెలంగాణ విద్యార్థులకు శుభాకాంక్షలు అని వివరించారు.

జిల్లాకో ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేయ‌డంతోపాటు, వాటిద్వారా అందుబాటులోకి వ‌చ్చిన ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డ‌ల‌కే ద‌క్కేలా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని స్ప‌ష్ట‌మైందన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేర‌కు ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్లలో 85శాతం సీట్ల‌ను లోకల్ రిజర్వ్ చేయ‌డం ద్వారా తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందేనని చెప్పారు. హైకోర్టు తాజా తీర్పుతో మ‌రో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభిస్తున్నాయి. ముందుచూపుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల ఏటా 1820 సీట్లు దక్కనున్నాయి. ఇది దాదాపు 20 కొత్త మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుతో స‌మానం అంటూ పోస్ట్‌ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version