హైదరాబాద్ లో 500కు పైగా అమెరికా కంపెనీలు : మంత్రి కేటీఆర్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణకు పెట్టుబడుల వర్షం కురుస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధానంగా హైదరబాద్ మహా నగరం పెట్టుబడుల స్వర్గధామంగా నిలిచిందని తెలిపారు. ఈ మహా నగరంలో 500కు పైగా అమెరికా సంస్థలు రాణిస్తున్నాయని కేటీఆర్ వెల్లడించారు.

ప్రముఖ టెక్నాలజీ కంపెనీల రెండో అతిపెద్ద కేంద్రాలు హైదరాబాద్​లో ఏర్పాటవుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే అమెజాన్ సంస్థ భాగ్యనగరంలో అతిపెద్ద కేంద్రం ఏర్పాటు చేసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరికొన్ని సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు.

యాపిల్‌, గూగుల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌ కేంద్రాలు హైదరాబాద్‌లో ఏర్పాటు అయ్యాయని ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన స్టేట్‌ స్ట్రీట్‌ సంస్థ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగంలో రాణిస్తోందని స్పష్టం చేశారు. 2018లో ప్రారంభమైన స్టేట్‌ స్ట్రీట్‌ సంస్థలో ప్రస్తుతం 9 వేల మంది ఉద్యోగులున్నారని వివరించారు. హైదరాబాద్‌ కౌన్సిల్‌ కార్యాలయం నుంచి భారీగా విద్యార్థి వీసాలు జారీ అవుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version