తెలంగాణాలో మే 21 వరకు లాక్ డౌన్…?

-

తెలంగాణాలో తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఆరు కేసులు ఏడు కేసులు రెండు కేసులు మాత్రమే గత వారం రోజుల్లో నమోదు కాగా ఇప్పుడు మళ్ళీ 17, 21 ఇలా నమోదు అవుతున్నాయి. గత రెండు రోజుల్లో ఇలాగే కేసులు నమోదు అయ్యాయి. దీనిపై తెలంగాణా ప్రభుత్వం చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. లాక్ డౌన్ ని మరింత దూరం పెంచితే మంచిది అని భావిస్తుంది.

ముందు కేంద్రం మే 3 వరకు రెండో విడత లాక్ డౌన్ పెంచగా దాన్ని తెలంగాణా సర్కార్ మే 7 వరకు చేసింది. ఇప్పుడు మళ్ళీ కేంద్రం మూడో విడత లాక్ డౌన్ ని మే 17 వరకు పెంచింది. రెండో విడతలో నాలుగు రోజులు పెంచినట్టే లాక్ డౌన్ ని మరో నాలుగు రోజులు అంటే మే 18 నుంచి 21 వరకు పెంచే ఆలోచనలో తెలంగాణా సర్కార్ ఉందని సమాచారం. దీనిపై రేపటి కేబినేట్ భేటీ లో సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మంత్రి వర్గ సమావేశం ఉంది రేపు మధ్యాహ్నం. కరోనా తీవ్రత, రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లో పరిస్థితి, దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, రాష్ట్రాల సరిహద్దులు, కరోనా ఆస్పత్రులు పెంచడం వంటి వాటి మీద సమీక్షలు చేసి… కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రాల సరిహద్దులను ఇప్పట్లో అనుమతించవద్దు అని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే సూచనలు ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news