తెలంగాణలో ఇప్పటివరకు ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారంటే?

-

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 17 స్థానాలకుగాను 8 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండగా… 9 చోట్ల కాంగ్రెస్‌, ఒక స్థానంలో మజ్లిస్‌ ముందంజలో ఉన్నాయి. 120 హాళ్లలో 1,855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురాలో అత్యధికంగా 24 రౌండ్లలో కౌంటింగ్‌ జరగనుంది. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్లలో కౌంటింగ్‌ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. మరోపక్క… కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌.. ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారో తెలుసా?

  • ఆదిలాబాద్‌: గోడం నగేశ్‌ (బీజేపీ) 60,994 ఆధిక్యం
  • భువనగిరి: చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్) 1,20,630 ఓట్ల ఆధిక్యం
  • చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (బీజేపీ) 80,039 ఆధిక్యం
  • హైదరాబాద్‌: అసదుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) 76,344 ఓట్ల ఆధిక్యం
  • కరీంనగర్: బండి సంజయ్ (బీజేపీ) 1,27,822 ఆధిక్యం
  • ఖమ్మం: రామసహాయం రఘురామ్‌ రెడ్డి (కాంగ్రెస్‌) 3,24,651 ఆధిక్యం
  • మహబూబాబాద్‌: బలరాం నాయక్‌ (కాంగ్రెస్) 2,24,429 ఆధిక్యం
  • మహబూబ్‌ నగర్‌: డీకే అరుణ (బీజేపీ) 10,640 ఆధిక్యం
  • మల్కాజిగిరి: ఈటల రాజేందర్ (బీజేపీ) 1,98,592 ఆధిక్యం
  • మెదక్‌: రఘునందన్‌ రావు (బీజేపీ) 19,422 ఆధిక్యం
  • నాగర్‌ కర్నూల్‌: మల్లు రవి (కాంగ్రెస్) 43,034
  • నల్గొండ: కుందురు రఘువీర్‌ రెడ్డి (కాంగ్రెస్) 3,77,941
  • నిజామాబాద్‌: ధర్మపురి అర్వింద్ (బీజేపీ) 58,051 ఆధిక్యం
  • పెద్దపల్లి: గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 69,050 ఓట్ల ఆధిక్యం
  • సికింద్రాబాద్: కిషన్‌ రెడ్డి (బీజేపీ) 39,677 ఓట్ల ఆధిక్యం
  • వరంగల్‌: కడియం కావ్య (కాంగ్రెస్) 1,23,099 ఓట్ల ఆధిక్యం
  • జహీరాబాద్‌: సురేశ్‌ షెట్కార్ (కాంగ్రెస్) 16,228 ఓట్ల ఆధిక్యం

Read more RELATED
Recommended to you

Latest news