అదనంగా ఎంత వచ్చిన కొనడానికి ప్రభుత్వం సిద్ధం : శ్రీనివాసరెడ్డి

-

ప్రస్తుత వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 5,46,865 ఎకరాలు కాగా పంట దిగుబడి అంచనా 9,63,102 మెట్రిక్ టన్నులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది అని మార్కఫెడ్ MD శ్రీనివాసరెడ్డి అన్నారు. కేంద్రం నిర్ణయించిన మొక్కజొన్న మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2225/-. మార్కెట్లో సగటు ధర కొన్ని ప్రాంతాలలో రూ. 2172/- అంటే 75/- నుండి Rs.100 వరకు మద్దతు ధరకన్నా తక్కువ ఉంది.

అయితే మార్కఫెడ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 MTs మొక్కజొన్నను కనీస మద్దతను ధరకు కొనుగులు చేయడానికి నాఫెడ్ అంగీకారం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 100 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను నాఫెడ్ తరపున కొనుగోలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. మద్దతు ధరకు అనుగుణంగా మొదటగా నాఫెడ్ తరపున జగిత్యాల, నిర్మల్ జిల్లాలతో సహా 12 కేంద్రాల ఏర్పాటు చేస్తాం. అలాగే రాష్ట్రములో అదనంగా వచ్చిన దిగుబడిని మద్దతు ధరకు కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version