కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనం నిర్ణయానికి ముందు ఆపరేషన్ ప్రోటోకాల్స్ ఖరారు కావాల్సిందేనని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేయనుంది. ఈమేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. ప్రాజెక్టుల స్వాధీనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గతంలో జరిగిన 16, 17 కేఆర్ఎంబీ సమావేశాల్లో స్పష్టం చేశామ దానికే కట్టుబడి ఉన్నట్లు మరోమారు స్పష్టం చేసే అవకాశం ఉంది.
ఇంజనీర్-ఇన్ – చీఫ్‌ల స్థాయిలో ఆపరేషన్ ప్రోటోకాల్స్‌పై మొదట కసరత్తు జరగాలని తెలపనుంది. ఇటీవలి దిల్లీ సమావేశంలో ఆపరేషన్ ప్రోటోకాల్‌పై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ జరగలేదు. అటు.. ప్రాజెక్టుల స్వాధీనానికి తాము అంగీకరించినట్లు మినట్స్‌లో పేర్కొన్న అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించనున్నారు. నాగార్జునసాగర్ వద్ద నవంబర్ 28వ తేదీ వరకు ఉన్న పరిస్థితులను పునరుద్ధరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కేంద్ర జలశక్తి శాఖను కోరే అవకాశం ఉంది.