తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నిన్న సాయంత్రం నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది.

ఇక ఇవాళ ఉమ్మడి అదిలాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే ఈ జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది.