తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రం లో మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, KNR, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ తదితర జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.