తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి భూమా అఖిల ఆమరణ దీక్ష భగ్నం అయింది. చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ లోనే మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, మా జీ మంత్రి భూమా అఖిల. అయితే.. ఆమె ఆరోగ్యం దృష్ట్యా బలవంతంగా ఆమరణ దీక్ష భగ్నం చేశారు పోలీసులు.
అనంతరం భూమా అఖిలను ఆళ్లగడ్డకు తరలిం చారు పోలీసులు. అఖిలప్రియకు షుగర్ లెవెల్స్ బాగా తగ్గడంతో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం భూమా అఖిలను ఇంట్లో వదిలారు పోలీసులు. అయినప్పటికీ… ఇంటి నుండే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు భూమా అఖిల. నాకేమైనా జరిగితే నంద్యాల పోలీసులే కారణమని.. నంద్యాలలో నా దీక్షను భగ్నం చేసిన పోలీసులందరిపై కేసు పెడతానని హెచ్చరించారు భూమా అఖిల.