ఐటీ ఉద్యోగులకు తెలంగాణ RTC గుడ్ న్యూస్..వారి కోసం కొత్త ప్రాజెక్ట్

ఐటీ ఉద్యోగులకు తెలంగాణ RTC గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ ఉద్యోగులకు కోసం ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తాజాగా ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు ఆఫీసులకు వెళ్లేందుకు సులువుగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.

ఐటీ ఉద్యోగులు కలిసి..తమను సంప్రదిస్తే.. ప్రత్యేకంగా వారి కోసం ఒక ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేస్తామని.. వారి వారి టైమింగ్స్‌ ప్రకారం, ఆర్టీసీ బస్సులు ట్రిప్పులు కొడుతుందని పేర్కొన్నారు సజ్జనార్‌. గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, మాదాపూర్‌ లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల కోసం.. ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తాజాగా ప్రకటించారు. బస్సు కావాలనుకునే వారు తమను సంప్రదించాలని ఆయన కోరారు.