TSRTC: తెలంగాణ ఆర్టీసీ సంస్థ ప్రమాదంలో పడింది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఆర్టీసీని ముంచుతుందని కార్మికులు అంటున్నారు. ఇప్పటికే రూ. 1400 కోట్ల రూపాయల ఉచిత బస్ సర్వీస్ బకాయిలు ఉన్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఉచిత సర్వీసుతో దారుణంగా మారిందని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.
నెల నెలా ఆర్టీసీకి ఉచిత బస్ సర్వీస్ డబ్బు ఇస్తామని మొదలు బొంకిన రేవంత్ సర్కార్, ఇప్పుడు నాలుగు నెలలు కావస్తున్నా ఇవ్వలేదని చెబుతున్నారు. రోజువారీ ఖర్చులకు కూడా టీఎస్ ఆర్టీసీ వద్ద డబ్బు లేక సతమతం అవుతోందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బస్సులకు డీజిల్, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కూడా ఇక్కట్లు పడుతున్నారట. అనాలోచిత నిర్ణయాలతో టీఎస్ ఆర్టీసీ భవిష్యత్ గంగలో కలిసే ప్రమాదం ఉందని ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారట.