సిటీ బస్‌పాస్ ధరలను పెంచుతూ TSRTC నిర్ణయం

-

గత కొంతకాలంగా తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగాలు చేపడుతూ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు, కార్యక్రమాలు చేపట్టింది. అయితే తాజాగా ఆర్టీసీ తీసుకున్న అకస్మాత్తు నిర్ణయంతో ప్రయాణికులు విస్మయం చెందుతున్నారు. చెప్పా పెట్టకుండా ఈ సంస్థ అలాంటి నిర్ణయాలు తీసుకోవడమేంటని మండిపడుతున్నారు. ఇంతకీ ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే..?

హైదరాబాద్ మహానగరంలోని సిటీ బస్‌ పాస్ ధరలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. డే బస్‌పాస్ ధరలను పెంచడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటని విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 100 రూపాయలుగా ఉన్న డే- బస్ పాస్ ధర తాజాగా 120 రూపాయలకు, మహిళలు, సీనియర్ సిటిజన్స్‌కు 80 రూపాయలుగా ఉన్న డే- పాస్ ధరను 100 రూపాయలకి ఆర్టీసీ పెంచింది. డే బస్‌ పాస్ గతంలో 120 రూపాయలుగా ఉన్నప్పుడు రోజుకు 25 వేల పాస్‌లు విక్రయిస్తే… 100రూపాయలు అయ్యాక 40 వేలు అమ్ముడుపోయినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news