తెలంగాణ ఆర్టీసీలో సెమీ డీలక్స్‌ బస్సులు.. టికెట్ ధర ఎంతంటే?

-

ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కొత్త రకం సెమీ డీలక్స్‌ బస్సులను త్వరలో ప్రారంభించేందుకు ఆర్టీసీలో రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈ బస్సుల్లో ఎక్కే ప్రయాణికులంతా (మహిళలతో సహా) టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బస్సు టికెట్ కనీస ఛార్జీ రూ.30. టోల్‌ ఫీజు, ప్యాసింజర్‌ సెస్, సేఫ్టీ సెస్‌ వంటివి అదనంగా ఉంటాయని వెల్లడించారు.

ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌ బస్సులకు మధ్యరకంగా ఈ కొత్త సర్వీసును ప్రవేశపెట్టనున్నారట. ఆర్టీసీ  కొద్దిరోజుల క్రితమే కరీంనగర్‌ సహా పలు రీజియన్లకు ఈ కొత్త సెమీడీలక్స్‌ బస్సులను పంపించింది. కిలోమీటరకు ఛార్జి 137 పైసలుగా పేర్కొంది. ప్యాసింజర్‌ ఫీజు కింద రూ.5, సేఫ్టీ ఫీజు రూ.1, అదనంగా రూ.6 చెల్లించాల్సి ఉంటుందనే వివరాలను ఈడీలు, రీజినల్‌ అధికారులకు వివరించింది. సెమీడీలక్స్‌ ప్రయాణమార్గంలో టోల్‌ గేట్లు ఉంటే ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.13 టోల్‌ ఛార్జి వసూలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news