అమెరికాకు చెందిన ఫార్మా సంస్థతో తెలంగాణ ఒప్పందం

-

అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ బ్రిస్టల్ మేయర్స్​తో తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బ్రిస్టల్ మేయర్స్‌తో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

అతి పెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. తయారీ రంగంలోనూ బ్రిస్టల్ మేయర్స్ దృష్టి సారించాలని కోరారు. ఫార్మాసిటీలో భూమి కేటాయించిన వెంటనే కంపెనీ ప్రారంభించవచ్చని చెప్పారు.

హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్​లో ఎంతో నైపుణ్యం ఉందని బ్రిస్టల్ మేయర్స్ కంపెనీ ప్రతినిధి సుమిత్ హిరావత్ అన్నారు.  తెలంగాణలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని ద్వారా 1500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం పరిశోధన, క్లినికల్ ట్రయల్స్ పై దృష్టి సారిస్తామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version