అసెంబ్లీలో PAC సమావేశం.. బీఆర్ఎస్ నేతల వాకౌట్

-

అసెంబ్లీ సెక్రటరీ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యే గాంధీ అధ్యక్షతన తొలి పీఏసీ సమావేశం జరిగింది.దీనికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు, పీఏసీ సభ్యులు కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ హజరయ్యారు.

ఇక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, భానుప్రసాద్, సత్యవతి రాథోడ్, ఎల్ రమణ హాజరవ్వగా ఎంఐఎం నుంచి బలాల, బీజేపీ నుంచి పవార్ హాజరయ్యారు.సమావేశం ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ..పీఏసీ అనేది ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.అసెంబ్లీ నుంచి ఐదుగురి పేర్లను ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీని కోరగా.. ఎమ్మెల్యే గంగుల, వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, ఎల్ రమణ, సత్యవతి పేర్లను ఇచ్చినట్లు గులాబీ పార్టీ పేర్కొంది. అయితే, లిస్టులో ఉన్న హరీష్ రావుకు బదులుగా లిస్టులో అరెకపూడి గాంధీ పేరును చేర్చారని, దీనిపై ప్రశ్నిస్తే ఎటువంటి ఆన్సర్ లేదని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version