Telangana Speaker Gaddam Prasad Kumar visited AP CM Chandrababu Naidu: తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెళ్లారు. మొన్న శనివారం రోజున తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన సంగతి తెలిసిందే.

రెండు రోజులుగా హైదరాబాదులోనే ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో తెలంగాణ నేతలు కొంతమంది చంద్రబాబు నాయుడు ను కలవడం జరుగుతోంది. నిన్న కూకట్పల్లి గులాబీ పార్టీ ఎమ్మెల్యే మాధవరావు కూడా చంద్రబాబు నాయుడు ను కలిశారు. తజాకా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా చంద్రబాబు నాయుడు ను కలిశారు. మర్యాదపూర్వకంగానే చంద్రబాబు నాయుడును తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.