ఢిల్లీకి బయల్దేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే సీఎం అయిన తర్వాత చాలా సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారట. ఇవాళ ఉదయం కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం అందుతోంది. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మార్పు అయిన తరుణంలోనే… రేవంత్ హస్తిన పర్యటనకు వెళ్లారు. దీంతో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ నియామకం అయ్యారు. దీపాదాస్ మున్షీపై వేటు వేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం… తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ ను నియామకం చేసింది. దీంతో దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చారు. 2009లో మధ్యప్రదేశ్లోని మాండసోర్ నుంచి ఎంపీగా పని చేసిన మీనాక్షి నజరాజన్..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. దీపాదాస్ మున్షీపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు.
- ఢిల్లీ
- ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి
- ఇవాళ అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం
- పీసీసీ కమిటీ, క్యాబినేట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకం పై అధిష్టాన పెద్దలలో చర్చించనున్న రేవంత్ రెడ్డి