తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్ షాక్. రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ వర్తింపజేయమని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా రుణమాఫీ కోసం రూ.31వేల కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం వెల్లడించింది.
రూ.10వేల కోట్లు ప్రస్తుతానికి సిద్ధంగా పెట్టుకోగా.. మిగిలిన సొమ్ము రుణాలు రూపంలో సమకూర్చుకోవాలని భావిస్తోంది. అటు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా విధివిధానాలపై అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించనుంది. ఈ సదస్సులు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఖమ్మంలో రైతు భరోసా వర్క్ షాప్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొననున్నారు. గురువారం రోజున ఆదిలాబాద్, శుక్రవారం రోజున మహబూబ్‌నగర్, 15వ తేదీన వరంగల్, 16వ తేదీన సంగారెడ్డిలో జిల్లా స్థాయి రైతుభరోసా సదస్సులు జరగనున్నాయి.