Telangana : 2023-24లో పన్నుల రాబడి టార్గెట్ రూ.85,412 కోట్లు

-

తెలంగాణ సర్కార్ ఈ ఏడాది వాణిజ్య పన్నుల శాఖకు భారీ టార్గెట్ ను నిర్దేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.85,412 కోట్లు అర్జించాలని స్పష్టం చేసింది. 2022-23లో వచ్చిన రాబడి రూ.72,525 కోట్ల కంటే ఇది రూ.12,887 కోట్లు అధికం. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టేది వాణిజ్య పన్నుల శాఖే. దీంతో సర్కారు ఆ శాఖపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఏటికేడు వసూళ్ల లక్ష్యాలు పెంచుతూ పోతోంది.

గత ఏడాది కంటే దాదాపు రూ.12,887 కోట్లు అధిక రాబడి లక్ష్యాన్ని నిర్దేశించిన సర్కారు..ఈ మేరకు వాణిజ్య పన్నులశాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థలు తాము నిర్వహిస్తున్న ఆర్థిక లావాదేవీలకు అనుగుణంగా పన్నులు చెల్లిస్తున్నాయా లేదా అనే కోణంలో నిశితంగా పరిశీలించాలని అధికారులకు స్పష్టం చేసింది. చిన్న వ్యాపారుల కంటే ఎక్కువ టర్నోవర్‌తో వ్యాపారం చేసే సంస్థలపై దృష్టి సారించడం ద్వారా ఎగవేతలను నియంత్రించవచ్చని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version