జనవరి 02 నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు

-

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ తాజాగా విడుదల అయింది. జనవరి 02 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండు షెడ్యూళ్లుగా పరీక్షలు జరుగనున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ప్రతీ ఏడాది టెట్ పరీక్షలు నిర్వహిస్తామని.. ఇది వరకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే.

జనవరి 2 ఉదయం, మధ్యాహ్నం పేపర్ 2 , జనవరి 5న పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్, జనవరి 08, 09, 10 తేదీలలో ఉదయం, మధ్యాహ్నం సోషల్ స్టడీస్ పేపర్ 1 పరీక్ష జరుగనుంది. అలాగే జనవరి 11న ఉదయం మధ్యాహ్నం పేపర్ 2, జనవరి 12న పేపర్ 2 సోషల్ స్టడీస్, జనవరి 18న పేపర్ 1 సోషల్ స్టడీస్, జనవరి 19న పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, జనవరి 20న పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పరీక్షలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news