తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ లో నిలిచింది. దక్షిణాదిన తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని కేంద్రం మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. తాజా ధరల ప్రకారం 2022-23లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732, స్థిర ధరల ప్రకారం రూ.1,64,657గా ఉంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ తలసరి ఆదాయం అతి తక్కువగా ఉందని అన్నారు.
ఏపీ తలసరి ఆదాయం రూ.2,19,518 ఉండగా, స్థిర ధరల ప్రకారం రూ.1,23,526కే పరిమితం అయింది. అటు తెలంగాణ రాష్ట్రం 2023 సంవత్సరం నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం రూ.3,66,306 కోట్ల అప్పులు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2019 నుంచి 2023 ఆర్థిక ఏడాది వరకు తెలంగాణ చేసిన అప్పుల వివరాలను వెల్లడించారు.