ఏపీలో కొందరు యువకులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్ మీద దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన కడప జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. రాజంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కడపకు వెళ్తుండగా నందలూరు వద్ద కొందరు యువకులు బస్సును అడ్డగించారు.
అనంతరం కొందరు బస్సులోకి ఎక్కి కండక్టర్ మీద దాడి చేయగా మరో వ్యక్తి కిటిలో నుంచి అతని కాలర్ పట్టుకుని దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆర్టీసీ యూనియన్లు మండిపడుతుండగా.. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా,దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.