అలెర్ట్.. తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

-

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేని వాన రాష్ట్ర ప్రజలను అవస్థలు పెడుతోంది. ఈ వానలు మరో నాలుగు రోజుల పాటు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

కొన్ని జిల్లాల్లో ఆదివారం రాత్రి ప్రారంభమై సోమవారం పగలంతా పడుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి పలు జిల్లాల్లో కుండపోతగా కురిశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం మంచిప్పలో 15.7 సెం.మీ. వర్షం కురిసింది. నిజామాబాద్‌ జిల్లాలో చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోనూ భారీగా వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌ నగరంలోనూ ఏకధాటిగా వర్షం పడింది. సోమవారం పగలు కామారెడ్డి జిల్లా గాంధారిలో 10 సెం.మీ. వర్షం పడింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో 8.9, కొండాపూర్‌లో 8.8, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో 7.7, మెదక్‌ జిల్లా చిలిప్‌చేడ్‌ 7.6 సెంటీమీటర్లు కురిసింది.

Read more RELATED
Recommended to you

Latest news